![]() |
![]() |

జబర్దస్త్ మెగా సెలెబ్రేషన్స్ లో ఆది అసలు విషయం చెప్పాడు. పాత, కొత్త టీమ్ లీడర్స్ ని పెట్టాడు. వెనక కత్తులతో పొడుస్తున్న వాళ్ళు కట్టప్పలు కానీ ముందున్న వాళ్ళు బాహుబలులు మాత్రం కాదు. కంటెస్టెంట్స్ అంతా టీమ్ లీడర్స్ ని పొడిచిన వాళ్ళే. ఒక్క రచ్చ రవి అన్నే హడావిడిలో తనకు తానే పొడుచుకున్నాడు. ఇక చలాకీ చంటి ఘట్టం మామూలుది కాదు అన్నాడు ఆది. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అంటూ నాగబాబు చెప్పాడు. జబర్దస్త్ లో ఉన్న కత్తులన్నీ కూడా చంటి వీపుకు దిగాయి. ఆల్రెడీ జల్లెడ అయ్యింది. "గోడ మీద పెయింట్ లు వేసుకునే వాడిని తీసుకొచ్చి ఆర్టిస్ట్ ని చేశా" అంటూ షకలక శంకర్ ని చూపించాడు. "అసలు వాడే మహా ప్రమాదకారి" అన్నారు నాగబాబు. "ఈయన కామెడీ మొత్తం నాగబాబు గారికి తెలిసి కూడా ఆయన దగ్గరకు వెళ్లి మీరొక 4 పెట్టండి మనకు 10 వస్తాయి అన్నాడట" అంటూ ఆది వాళ్ళ మధ్య ఉన్న సీక్రెట్స్ ని లీక్ చేసేసాడు. వెంటనే నాగబాబు "ఆది ఆల్మోస్ట్ అందరూ కలిసి నన్ను పొడిచారు. ఆ విషయం మీకు తెలుసో లేదో.
ఈ స్టేజి మీద నన్ను ప్రతీ వాళ్ళు పొడిచారు. చంటి వీపు జల్లెడ అయ్యింది. అసలు నాకు వెనక ఎం లేదు..వేరే చర్మం కప్పుకుని తిరుగుతున్నా..." అన్నారు. ఇంకో ఘట్టం సుధీర్ - రష్మీ. "నేను చచ్చిపోతే ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నే చచ్చిపోతా" అన్నాడు .."చచ్చిపోవడం దేవుడెరుగు..కనీసం వచ్చిపోవడం కూడా లేదు" అంటూ సుధీర్ మీద పంచులు వేసాడు. "రష్మీ బయటకు వెళ్తే సుధీర్ అన్న ఎక్కడ అంటారు..సుధీర్ ప్రెస్ మీట్ కి వెళ్తే రష్మీ వదిన ఎక్కడా అని అడుగుతారు చివరికి ఏమయ్యింది. వదిన ఒంటరయ్యింది. ఆయనేమో అక్కడ ఆడపిల్లలతో పాడుకుంటున్నాడు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు" అంటూ సెటైర్స్ వేసాడు. సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ ని చూసి పుట్టుకొచ్చిన రైల్వే ట్రాక్ ఇమ్మానుయేల్ - వర్ష జోడి. "కరోనా వైరస్ వచ్చిన తర్వాత నేను వర్షని ఈటీవీకి పరిచయం చేసాను. ఈమె ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ పెట్టుకుని ఇంకో వైరస్ ని ఈటీవీకి పరిచయం చేశారు." అందరి గురించి చెప్పుకొచ్చాడు ఆది.
![]() |
![]() |